“చంద్రముఖి 2” ఆ సీనియర్ హీరోయిన్ లేరు!

Published on Jun 3, 2020 7:23 pm IST

ఒక్క మన సౌత్ ఇండియా లోనే కాకుండా మొత్తం ఇండియన్ సినిమాలోనే హర్రర్ జాన్రాలో సూపర్ స్టార్ రజినీకాంత్ జ్యోతికలు నటించిన “చంద్రముఖి” సినిమా ఒక సెన్సేషన్. మొదట 2004 లో కన్నడ భాషలో “ఆప్తమిత్ర” గా తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాక తమిళ్ లో రజినీతో తీసి అక్కడ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.

అయితే గత కొన్నాళ్ల కితమే ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టుగా దర్శకుడు వాసు తెలుపగా అందులో లారెన్స్ కూడా కనిపిస్తారని ఖాయం అయ్యింది. దీనితో ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కూడా నటించనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ కాగా దానిపై సిమ్రాన్ ఒక కంక్లూజన్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో తాను నటించడం లేదని అలాగే తనకు ఆ చిత్ర యూనిట్ నుంచి కూడా ఎలాంటి పిలుపు రాలేదని అందుకే ఆ వార్తలు ఎవరు నమ్మొద్దు అంటూ తన అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చారు.

సంబంధిత సమాచారం :

More