పవన్ రీమేక్ కి ఆ టైటిల్ కాదట !

పవన్ రీమేక్ కి ఆ టైటిల్ కాదట !

Published on Nov 8, 2020 2:15 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియం’కు తెలుగు రీమేక్ ఈ చిత్రం. ఇందులో పవన్ ఒరిజినల్ వెర్షన్లో బిజూ మీనన్ చేసిన పోలీస్ పాత్ర చేయనున్నారు. అయితే మళయాళ వెర్షన్, తమిళ వెర్షన్ మధ్య చాలా తేడా ఉంటుందట. ముఖ్యంగా పవన్ పాత్రలో. దాన్ని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మరో గబ్బర్ సింగ్ తరహాలో డిజైన్ చేశారట.

సినిమాలో హైఓల్టేజ్ యాక్షన్, పవన్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఖాయమని అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ఒకప్పటి చిరంజీవి చిత్రం ‘బిల్లా రంగా’ టైటిల్ ను వాడుకోవాలనే యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదట. ఇక ‘వకీల్ సాబ్’ షూటింగ్ ముగియగానే ఈ సినిమా మొదలుకానుంది. నవంబర్, డిసెంబర్ నాటికి షూటింగ్ పూరయ్యేలా పక్క ప్లాన్ సిద్ధం చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు