మరో ఘనత సాధించిన ‘అడాల్‌సెన్స్‌’ సిరీస్ !

మరో ఘనత సాధించిన ‘అడాల్‌సెన్స్‌’ సిరీస్ !

Published on Jan 12, 2026 8:00 PM IST

Adolescence

‘అడాల్‌సెన్స్‌’ సిరీస్‌ చాలా బాగా ఆకట్టుకుంది. పైగా పలు అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ఈ సిరీస్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. ‘గోల్డెన్‌ గ్లోబ్స్‌ 2026’ అవార్డుల్లో ఉత్తమ నటుడు, సహాయనటుడి జాబితాల్లో అవార్డును ఈ సిరీస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ సిరీస్‌లో ఓవెన్‌ కూపర్‌ తన నటనతో మెప్పించాడు. ఐతే, ఉత్తమ సహాయనటుడిగా అతి చిన్న వయసులోనే ఈ అవార్డును సొంతం చేసుకొని ఓవెన్‌ కూపర్‌ రికార్డు క్రియేట్ చేశాడు.

అలాగే ఉత్తమ నటుడి కేటగిరీలో స్టీఫెన్‌ గ్రాహం అవార్డు అందుకోవడం జరిగింది. అన్నట్టు ఈ అవార్డు వేడుకలకు నిక్కీ గ్లేజర్‌తో పాటు ప్రియాంక చోప్రా కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

‘గోల్డెన్‌ గ్లోబ్స్‌ 2026’ అవార్డుల్లో విజేతలు వీరే :

ఉత్తమ సహాయనటుడు (టీవీ సిరీస్‌): ఓవెన్‌ కూపర్‌ (అడాల్‌సెన్స్‌)

ఉత్తమ నటుడు (టీవీ సిరీస్‌) : స్టీఫెన్‌ గ్రాహం (అడాల్‌సెన్స్‌)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: పాల్‌ థామస్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆనథర్‌)

ఉత్తమ నటి : రోజీ బేర్నీ (ఇఫ్‌ ఐ హేడ్‌ లెగ్స్‌ ఐడిడ్‌ కిక్‌ యూ)

ఉత్తమ సహాయ నటి (సినిమా): టెయానా టేలర్‌ (వన్‌ బ్యాటిల్‌ ఆనథర్‌)

ఉత్తమ సహాయ నటుడు (సినిమా): స్టెలన్‌ (సెంటిమెంట్ వాల్యూ)

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు