తెలుగు ఓటిటి వీక్షకులకు ది బెస్ట్ వీకెండ్..!

తెలుగు ఓటిటి వీక్షకులకు ది బెస్ట్ వీకెండ్..!

Published on Apr 12, 2024 9:05 AM IST


ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఓటిటి కంటెంట్ కి ఎలాంటి డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం. ఒక్క ఇంటర్నేషనల్ వైడ్ గానే కాకుండా రీజనల్ గా కూడా ఓటిటి కంటెంట్ ని వీక్షకులు చూస్తున్నారు. ఇక వీకెండ్ కి థియేటర్స్ లో సినిమాలు చూద్దాం అనుకునేవారు ఎలా ఉన్నారో ఓటిటిలో కూడా కొత్త రిలీజ్ లు సినిమాలు సిరీస్ లు చూసేవారు కూడా అధికం. అయితే మన తెలుగులో కూడా ఈ కొత్త కంటెంట్ కి మంచి డిమాండ్ ఉంది.

అయితే ఇటీవల కాలంలో అయితే తెలుగు ఆడియెన్స్ కి ఈ వారాంతం కన్నా మంచి వారాంతం లేదని చెప్పాలి. ఓటిటిలో ఈ ఒక్కరోజే పలు డిఫరెంట్ ప్లాట్ ఫామ్ లలో మొత్తం మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అలరించేందుకు వచ్చాయి. మరి మొదటగా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో మళయాళ యూత్ ఫుల్ హిట్ “ప్రేమలు” తెలుగు డబ్బింగ్ వెర్షన్ రాగా ప్రైమ్ వీడియోలో ఒక మ్యాడ్ కామెడీ డ్రామా “ఓం భీం బుష్” వచ్చింది.

ఇక వీటితో పాటుగా జీ 5 లో చాలా తక్కువ బడ్జెట్ తో ఊహించని రేంజ్ విజువల్స్ తో కూడిన తెలుగు సినిమా “గామి” అలరించేందుకు వచ్చింది. ఈ మూడింటితో ఈ వీకెండ్ తెలుగు ఆడియెన్స్ కి మాత్రం బెస్ట్ వీకెండ్ గా మారుతుంది అని చెప్పాలి. మరి ఈ మూడు చిత్రాల సమీక్షలు ఈ కింద ఉన్నాయి చదివి ట్రై చేద్దామన్నా మీ ఇష్టం..

“ఓం భీం బుష్” సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
“గామి” సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
“ప్రేమలు” సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు