సూపర్ స్టార్స్ యూట్యూబ్ వార్ అదిరిందిగా..!

Rajini Mahesh

నిన్న ఇద్దరు టాప్ హీరోల సినిమాలకు సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ వీడియోస్ యూట్యూబ్ లో విడుదల అయ్యాయి. రజిని కాంత్ దర్బార్ మూవీ ట్రైలర్ తో పాటు, మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి మూడవ సాంగ్ ‘హి ఈజ్ సో క్యూట్’ విడుదల కావడం జరిగింది. గంటల వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ విడుదలైన ఈ ట్రైలర్ మరియు సాంగ్ యూట్యూబ్ లో క్షణాల్లో ట్రెండింగ్ లోకివెళ్ళాయి. ఐతే మహేష్ సరిలేరు నీకెవ్వరు సాంగ్ కి మించిన ఆదరణ దర్బార్ ట్రైలర్ దక్కించుకోవడం విశేషం.

దర్బార్ తెలుగు ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతూ ఉండగా, దాని తరువాత సెకండ్ ప్లేస్ లో సరిలేరు నీకెవ్వరు హి ఈజ్ సో క్యూట్ సాంగ్ ఉంది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్స్ యూట్యూబ్ లో తమ చిత్రాలకు సంబంధించిన వీడియోలతో ఒకే సమయంలో ఇలా పోటీపడటం ఆసక్తికరంగా మారింది. ఐతే వ్యూస్ పరంగా మహేష్ సాంగ్ దర్బార్ తెలుగు ట్రైలర్ కంటే ఎక్కువ దక్కించుకుంది. ఇక దర్బార్, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.

Exit mobile version