పుష్ప‌ 2 : ‘సూసేకి’ లిరిక‌ల్ సాంగ్.. స్టెప్పు వేయాల్సిందే!

పుష్ప‌ 2 : ‘సూసేకి’ లిరిక‌ల్ సాంగ్.. స్టెప్పు వేయాల్సిందే!

Published on May 29, 2024 12:35 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తోన్న ‘పుష్ప – ది రూల్’ మూవీ కోసం ప్రేక్ష‌కులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్, ఫ‌స్ట్ సాంగ్ ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ ద‌క్కింది. తాజాగా ఈ సినిమా నుండి సూసేకి లిరిక‌ల్ సాంగ్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

చంద్ర‌బోస్ అందించిన చ‌క్క‌టి లిరిక్స్ కు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ క్యాచీ ట్యూన్ అందించారు. ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడిన తీరు మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ పాట ఖ‌చ్చితంగా చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని అభిమానులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

‘పుష్ప – ది రూల్’ మూవీని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆగ‌స్టు 15న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండ‌ర్స్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్ తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు