“ది ఫ్యామిలీ స్టార్” సెన్సార్ పూర్తి.. అఫీషియల్ రన్ టైం వచ్చేసింది

“ది ఫ్యామిలీ స్టార్” సెన్సార్ పూర్తి.. అఫీషియల్ రన్ టైం వచ్చేసింది

Published on Apr 4, 2024 12:26 PM IST


విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా నటించిన అవైటెడ్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్” (The Family Star). దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్ సహా అన్ని వర్గాల ఆడియెన్స్ ని అలరించేందుకు రేపు థియేటర్స్ రిలీజ్ కి సిద్ధంగా ఉండగా ఇప్పుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందజేయగా మేకర్స్ అనౌన్స్ చేస్తూ సినిమా అఫీషియల్ రన్ టైం ని కూడా రివీల్ చేశారు. దీనితో మొత్తం 150 నిముషాలు పాటుగా “ఫ్యామిలీ స్టార్” ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి అన్నట్టుగా విజయ్ మృణాల్ ఠాకూర్ లపై ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో తెలియజేసారు. మొత్తానికి అయితే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఫ్యామిలీ స్టార్ రాబోతున్నాడు. ఇక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు