ఓటిటి : ఈ శుక్రవారం నుండి ఆ భాషల్లో స్ట్రీమ్ కానున్న ‘ది ఫ్యామిలీ స్టార్’ ?

ఓటిటి : ఈ శుక్రవారం నుండి ఆ భాషల్లో స్ట్రీమ్ కానున్న ‘ది ఫ్యామిలీ స్టార్’ ?

Published on Apr 30, 2024 8:06 PM IST

యువ నటుడు విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది ఫ్యామిలీ స్టార్. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించగా గోపి సుందర్ సంగీతం అందించారు.

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి యావరేజ్ విజయం అందుకున్న ది ఫ్యామిలీ స్టార్, కొన్నాళ్ల క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా తెలుగు, తమిళ భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది. అయితే విషయం ఏమిటంటే, రానున్న శుక్రవారం నుండి ఈమూవీ మలయాళ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అతి త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు