‘కాజల్’తో చేసిన సినిమాలన్ని హిటే – తేజ

Published on May 21, 2019 3:00 am IST

కాజల్ అగర్వాల్ – బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా తేజ దర్శకత్వంలో మే 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావ్వడానికి సన్నధం అవుతుంది ‘సీత’. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ పై నిర్మిస్తున్నారు. కాగా ఈ రోజు ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరుపుకుంది. ఈ ఈవెంట్ లో చిత్రబృందం మొత్తం పాల్గొంది.

కాగా ఈ సందర్భంగా దర్శకుడు తేజ మాట్లాడుతూ.. ‘సినిమాలో అందరు చాల బాగా నటించారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి ని రెగ్యులర్ గా కాకుండా చాల కొత్తగా చూస్తారు. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇక సోను సూద్ గారు అయితే అద్భుతంగా నటించారు. అలాగే కాజల్ విషయానికి వస్తే.. తనతో నేను చేసిన అన్ని సినిమాలు హిటే. అదే విధంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చారు.. మా ప్రొడ్యూసర్స్ చాల మంచివారు..వారితో సినిమా చేయడం నా అదృష్టం’ అని అన్నారు.

సంబంధిత సమాచారం :

More