జూన్ నుండి షూట్ కి రెడీ అవుతోన్న యంగ్ హీరో !

జూన్ నుండి షూట్ కి రెడీ అవుతోన్న యంగ్ హీరో !

Published on Feb 15, 2020 4:52 PM IST

ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కే వి గుహన్ దర్శకత్వంలో వచ్చిన 118′. చిత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అందించిన విజయానందంతో మహేష్ కోనేరు ఇప్పటికే మిస్ ఇండియా చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. కాగా ఆయన ఇప్పుడు నాగశౌర్యతో మరో సినిమాని కూడా ప్రారంభించారు.

ఉహ‌లు గుస‌గుస‌లాడే సినిమా నుండి రీసెంట్‌గా విడుద‌లైన అశ్వ‌థ్థామ సినిమా వ‌ర‌కు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రాజా ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. జూన్ నెల ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు