సూపర్ రేటింగ్ తో దూసుకు పోతున్న “ది గోట్ లైఫ్”

సూపర్ రేటింగ్ తో దూసుకు పోతున్న “ది గోట్ లైఫ్”

Published on Mar 29, 2024 7:30 PM IST

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బ్లెస్సి దర్శకత్వం లో సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్ (తెలుగులో ఆడు జీవితం). మార్చి 28, 2024న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల అయిన ఈ సినిమా ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం టికెటింగ్ యాప్ అయిన బుక్ మై షో లో సూపర్ రేటింగ్ తో దూసుకు పోతుంది. 9.5 పబ్లిక్ రేటింగ్ తో ది గోట్ లైఫ్ అలరిస్తుంది.

అమలా పాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంను తెలుగులో, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ విడుదల చేయడం జరిగింది. జిమ్మీ జీన్-లూయిస్, రిక్ అబీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు