25 రోజుల్లో 150 కోట్లతో “ది గోట్ లైఫ్”

25 రోజుల్లో 150 కోట్లతో “ది గోట్ లైఫ్”

Published on Apr 21, 2024 3:07 PM IST

మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బ్లెస్సి దర్శకత్వం లో తెరకెక్కిన సర్వైవల్ థ్రిల్లర్ ది గోట్ లైఫ్ (The Goat life). తెలుగు లో ఆడు జీవితం గా థియేటర్ల లోకి వచ్చింది. ఈ చిత్రం తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. 25 రోజుల్లో ఈ చిత్రం 150 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

ఈ చిత్రం రిలీజైన అన్ని బాషల్లో కలిపి ఈ వసూళ్లను రాబట్టింది. అమలా పాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రంను తెలుగులో, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ విడుదల చేయడం జరిగింది. జిమ్మీ జీన్ – లూయిస్, రిక్ అబీ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్ మరియు ఆల్టా గ్లోబల్ మీడియా నిర్మించాయి. ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు