‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ : ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ‘విజిల్ పోడు’ సాంగ్

‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ : ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన ‘విజిల్ పోడు’ సాంగ్

Published on Apr 16, 2024 12:01 AM IST

కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 5న ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, నిన్న ఈ మూవీ నుండి విజిల్ పోడు అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు మేకర్స్.

కాగా ఈ సాంగ్ గడచిన 24 గంటల్లో 24.88 వ్యూస్ తో అత్యధిక మంది వీక్షించిన సాంగ్ గా సౌత్ ఇండియన్ లిరికల్ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ సాంగ్ లైక్స్ పరంగా నాలుగవ స్థానంలో నిలిచి 1.25 మిలియన్ లైక్స్ మాత్రమే సొంతం చేసుకుంది. కాగా గతంలో విజయ్ నటించిన బీస్ట్ మూవీలోని అరబిక్ కుత్తు సాంగ్ 2. 20 మిలియన్ లైక్స్ సాధించిన టాప్ రికార్డుని మాత్రం విజిల్ పోడు బ్రేక్ చేయలేకపోయింది. కాగా తప్పకుండా ఈ మూవీ రిలీజ్ అనంతరం అందరి అంచనాలు అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు