‘రన్ రాజా రన్’ హైలైట్స్ ఇవే.!

‘రన్ రాజా రన్’ హైలైట్స్ ఇవే.!

Published on Jul 29, 2014 8:32 AM IST

Run_Raja_Run-(2)

‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన యువి ప్రొడక్షన్స్ బ్యానర్ పై వంశీకృష్ణ – ప్రమోద్ కలిసి నిర్మించిన సినిమా ‘రన్ రాజా రన్’. ఇప్పటి వరకూ సీరియస్ పాత్రల్లోనే కనిపించిన యంగ్ హీరో శర్వానంద్ మొదటిసారిగా ఫుల్ లెంగ్త్ లవర్ బాయ్ లుక్ లో కనిపించనున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 01న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

లవ్ స్టొరీ విత్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ద్వారా సుజీత్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. సుజీత్ ఈ సినిమాలోని హైలైట్స్ గురించి చెబుతూ ‘ రన్ రాజా రన్ కి మేజర్ హైలైట్ కథ మరియు స్క్రీన్ ప్లే. ఆ తర్వాత మధి సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ మరియు చివరి 30 నిమిషాలు ప్రత్యేక హైలైట్స్ గా నిలుస్తాయని’ సుజీత్ అన్నాడు. శర్వానంద్ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజా వార్తలు