ఓటిటిలో భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘ది కేరళ స్టోరీ’

ఓటిటిలో భారీ వ్యూస్ తో దూసుకెళ్తున్న ‘ది కేరళ స్టోరీ’

Published on Feb 20, 2024 3:01 AM IST

కొన్నాళ్ల క్రితం థియేటర్స్ లో రిలీజ్ అయి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీ ఇటీవల ఫిబ్రవరి 16న ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చింది. సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీలో ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నానీ, దేవదర్శిని, మరియు విజయ్ కృష్ణ కీలక పాత్రలు చేసారు.

విషయం ఏమిటంటే, ప్రస్తుతం ది కేరళ స్టోరీ మూవీ జీ 5 లో కేవలం మూడు రోజుల్లోనే 150 మిలియన్ కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో దూసుకెళుతోంది. ఆ విధంగా అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతూ దూసుకెళ్తున్న తమ మూవీ కి ఓటిటి ఆడియన్స్ ఈ స్థాయి రెస్పాన్స్ అని అందించడంతో టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు