తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్

తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన కోలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్

Published on Apr 11, 2024 1:01 AM IST

ఇటీవల కోలీవుడ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న లవ్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ లవ్ టుడే. ఇక తెలుగులో డబ్ అయిన ఈ మూవీ ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంది. ఈ మూవీలో హీరోగా నటించి దర్శకత్వం వహించిన ప్రదీప్ రంగనాథన్ అందరినీ ఆకట్టుకుని బాగా పేరు సొంతం చేసుకున్నారు.

అయితే ఈ మూవీ అనంతరం ఆయన నెక్స్ట్ మూవీ తెలుగు ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ వారితో ఉంటుందని కొద్దిరోజుల క్రితం నుండి మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఇక లేటెస్ట్ గా తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేసారు ప్రదీప్ రంగనాథన్. ఏజిఎస్ ప్రొడక్షన్ సంస్థ పై రూపొందనున్న ఈ మూవీకి అశ్వత్ మారిముత్తు తెరకెక్కించనున్నారు.

దీనికి సంబందించిన అనౌన్స్ మెంట్ వీడియో తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీకి లియోన్ జేమ్స్ సంగీతం అందించనుండగా అర్చన కల్పతి గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు