తమిళనాడులో అత్యధిక మాలీవుడ్ గ్రాసర్‌గా నిలిచిన తాజా మలయాళ చిత్రం

తమిళనాడులో అత్యధిక మాలీవుడ్ గ్రాసర్‌గా నిలిచిన తాజా మలయాళ చిత్రం

Published on Feb 28, 2024 10:19 PM IST

తాజాగా మలయాళంలో రిలీజ్ అయి మంచి సక్సెస్ దిశగా దూసుకెళ్తోన్న మంజుమ్మేల్ బాయ్స్ మూవీ అక్కడ బాగా కలెక్షన్ రాబడుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించగా సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అర్జున్ కురియన్ మరియు తదితరులు కీలక పాత్రలు పోషించారు.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ తమిళనాడులో హైయెస్ట్ గ్రాస్ అందుకున్న మలయాళం మూవీగా నిలిచింది. ఇప్పటివరకు ఈ మూవీ తమిళనాడులో రూ. 2 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అతి తక్కువ షోస్, స్క్రీన్స్ తో ఈ రికార్డుని మంజుమ్మేల్ బాయ్స్ అందుకోవడం విశేషం. ఇక శుక్రవారం నుండి తమిళనాడు లో ఈ మూవీ మరిన్ని థియేటర్స్ ద్వారా ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు