కొత్త బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మెగా మేనల్లుడి సినిమా !

Published on Feb 5, 2019 1:09 am IST

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడైన వైష్ణ‌వ్‌ తేజ్ నూతన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్స‌వం రోజు చిత్రబృందం విడుదల చేసిన పోస్టర్ లో కూడా వైష్ణ‌వ్‌ తేజ్ పూర్తి స్థాయి మాస్ లుక్ లో బెస్తవాడిగా అద్బుతంగా ఉన్నాడు.

అదీకాక ఈ చిత్ర ప్రారంభోత్స‌వంలో మెగాస్టార్ మాట్లాడుతూ.. “ఈ చిత్రం నాకు రంగస్థలం లాంటి బలమైన ఎమోషన్ మూవీలా అనిపించింది అని చిరంజీవి చెప్పారు. బహుశా చిరు బెస్తవాళ్ల బ్యాక్ డ్రాప్ లోని మాస్ అంశాలను ఉద్దేశించే అలా చెప్పారని అనిపిస్తోంది.

ఇక ఈ చిత్రానికి ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :