మార్కెట్ లోకి కొత్త ‘స్పైడర్ మ్యాన్’.. ఈ ఓటిటిలోకి ఘోస్ట్ రైడర్ హీరోతో ప్లాన్ చేసిన సిరీస్ వచ్చేసింది!

మార్కెట్ లోకి కొత్త ‘స్పైడర్ మ్యాన్’.. ఈ ఓటిటిలోకి ఘోస్ట్ రైడర్ హీరోతో ప్లాన్ చేసిన సిరీస్ వచ్చేసింది!

Published on May 27, 2026 4:01 PM IST

 spider noir

ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సూపర్ హిట్ సూపర్ హీరో చిత్రాలు పాత్రల్లో ‘స్పైడర్ మ్యాన్’ అనే తెలియని వారు ఉండరు. సోని/మార్వెల్ సంస్థలకి చెందిన ఈ పాపులర్ పాత్రపై పలు భారీ సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అయితే గత కొన్నాళ్ల నుంచి స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కి కొత్త ట్రీట్ గా సరికొత్త స్పైడర్ మ్యాన్ ని సోనీ వారు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.

ఘోస్ట్ రైడర్ హీరో నికోలస్ కేజ్ ప్రధాన పాత్రలో అనౌన్స్ చేసిన ఆ క్రేజీ వెబ్ సిరీస్ నే ‘స్పైడర్ నోయిర్’. వరల్డ్ పాపులర్ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు దీనిని అనౌన్స్ చేసి ఒకో టీజర్, ట్రైలర్ లని విడుదల చేయగా వీటికి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫైనల్ గా ఈ అవైటెడ్ సిరీస్ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఒరిజినల్ ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు డబ్బింగ్ సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో కూడా ఈ సిరీస్ నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది. సో మార్కెట్ లోకి వచ్చిన కొత్త స్పైడర్ మ్యాన్ సాహసాలు చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చిన ఈ సరికొత్త సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ సిరీస్ ని హ్యారీ బ్రాడ్ బీర్ దర్శకత్వం వహించగా ఈ సిరీస్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించబడింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు