తెలుగు రాష్ట్రాల్లో ఒడిస్సియస్ హవా.. 2 రోజుల్లో గట్టి నంబర్స్!?

The Odyssey Review

ప్రస్తుతం మళ్ళీ మూవీ లవర్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ థియేటర్స్ లో దక్కేసింది. అది లోకల్ అయినా ఇంటర్నేషనల్ అయినా మన టాలీవుడ్ ఆడియెన్స్ ఆదరించడంలో ముందు ఉంటారు. అలా తెలుగు స్టేట్స్ లో లేటెస్ట్ గా విడుదల అయ్యిన హాలీవుడ్ అవైటెడ్ చిత్రం ‘ఒడిస్సీ’ హవా కొనసాగిస్తూ ఉండడం గమనార్హం.

తెలుగు వెర్షన్ లో కూడా విడుదల అయ్యిన ఈ చిత్రానికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 రోజుల రన్ కి మంచి వసూళ్లే వచ్చినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ పి ఆర్ నంబర్స్ ప్రకారం ఒడిస్సీ ఈ రెండు రోజుల్లో సుమారు 7 కోట్లకి పైగానే గ్రాస్ ని కొల్లగొట్టినట్టు తెలుస్తుంది.

ఇది మాత్రం పూర్తిగా దర్శకుడు నోలన్ మాస్ మ్యాజిక్ అని చెప్పాల్సిందే. ఇక మూడో రోజు కూడా ఈ హిస్టారికల్ చిత్రానికి మంచి నంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ చిత్రం ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version