న్యాచురల్ స్టార్ నాని – శ్రీకాంత్ ఓదెల కలయికలో రాబోతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఈ గురువారం థియేటర్లలోకి రానుంది. నైజాం ప్రాంతానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్‌లు నిన్న రాత్రి డిస్ట్రిక్ట్ యాప్‌లో ప్రారంభమయ్యాయి. అభిమానులు వెంటనే తరలిరావడంతో, సీట్ల కోసం భారీ తొక్కిసలాట జరిగింది. మొత్తానికి ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే కోటి రూపాయలకు పైగా వసూలు చేసి, లక్షకు పైగా టికెట్లు అమ్మకాలు జరిగాయి. ఇక అన్ని ప్రాంతాలలో పూర్తి అడ్వాన్స్ బుకింగ్‌లు త్వరలోనే ప్రారంభమవుతాయి.
సినిమా పై ఉన్న ఆసక్తిని బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే షేర్ నాని కెరీర్ లోనే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రాబోతున్నాయని అంచనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే తొలి వీకెండ్లో ఆ నంబర్లు మరింత భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాగా ఈ చిత్రంలో ప్రతినాయకుడైన ‘షికంజా మాలిక్’ పాత్రను మోహన్ బాబు పోషిస్తున్నారు. అన్నట్టు ‘ప్యారడైజ్’ సినిమాలో నాని క్యారెక్టర్, డైలాగులు చాలా బోల్డ్‌గా, ఊరమాస్‌గా ఉండబోతున్నాయట.
ఈ సినిమాలో రాఘవ్ జుయాల్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు, బాబు మోహన్ మరియు సోనాలి కులకర్ణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ స్థాయిలో ఈ పాన్-ఇండియా చిత్రం రూపొందుతోంది.
