“ది ప్యారడైజ్” టీజర్.. ఈ పని ముందే చేసుండాల్సింది!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న అవైటెడ్ భారీ సినిమానే ది ప్యారడైజ్. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ మ్యాడ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా పట్ల ఇటీవల వచ్చిన టీజర్ తో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ టీజర్ వచ్చిన తర్వాత మొదటిసారి షాకింగ్ రెస్పాన్స్ అందుకోవాల్సి వచ్చింది. నాని ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పిన డైలాగ్ లు అర్ధం కాకపోవడంతో పలు ట్రోల్స్ కూడా తప్పలేదు.

దీనితో వాటిని వివరిస్తూ మళ్లీ పోస్ట్ లు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దీనితో పాటుగా మళ్లీ టీజర్ ని ఎడిట్ చేసి ఈసారి డైలాగ్స్ స్పష్టంగా అర్ధం అయ్యేలా రెడీ చేసి విడుదల చేయడంతో మళ్లీ ఆడియెన్స్ లో పాజిటివ్ గా మారింది. అయితే ఇదేదో ముందే చేసి ఉంటే బాగుండు కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ మాత్రం డెఫినెట్ గా సినిమా వెర్షన్ కు కూడా జాగ్రత్త తీసుకుంటారని చెప్పొచ్చు. ఇక స్ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version