2026లో రికార్డు ప్రీసేల్స్ తో ‘ది ప్యారడైజ్’ బిగ్ స్టార్ట్!

2026లో రికార్డు ప్రీసేల్స్ తో ‘ది ప్యారడైజ్’ బిగ్ స్టార్ట్!

Published on Sep 24, 2026 12:00 PM IST

ఈ ఏడాదిలో మన టాలీవుడ్ నుంచి భారీ అంచనాలు సెట్ చేసుకున్న పలు చిత్రాల్లో నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో చేసిన ‘ది ప్యారడైజ్’ కూడా ఒకటి. ఈ సినిమా దెబ్బతో నాని టైర్ 1 లోకి వెళ్ళిపోవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యిపోయారు. ఇక దీనికి నిదర్శనంగానే సినిమా ప్రీ సేల్స్ బుకింగ్స్ కూడా ఊహించని రేంజ్ లో ఇండియా వైడ్ గా స్టార్ట్ అయ్యాయి.

మన టాలీవుడ్ లో అయితే ఈ ఏడాదిలోనే రికార్డు ప్రీసేల్స్ ఈ సినిమాకి నమోదు అయినట్టు టీం కన్ఫర్మ్ చేశారు. బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్ లలో ప్యారడైజ్ సినిమాకి కేవలం ప్రీ సేల్స్ లోనే 18 లక్షలకి పైగా టికెట్లు అమ్ముడుపోయినట్టు వారు తెలిపారు. దీనితో ఈ ఏడాదిలో నాని బిగ్గెస్ట్ స్టార్ట్ అందుకున్నాడు అని చెప్పవచ్చు. ఇక రిలీజ్ రోజు బుకింగ్స్ కూడా గట్టిగానే కొనసాగుతున్నాయి. మరి ఫైనల్ గా ప్యారడైజ్ లెక్క ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు