‘ది ప్యారడైజ్’ మేనియా.. సోషల్ మీడియా అంత జడల్ జమానానే

‘ది ప్యారడైజ్’ మేనియా.. సోషల్ మీడియా అంత జడల్ జమానానే

Published on Feb 24, 2026 5:26 PM IST

The Paradise

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రమే ది ప్యారడైజ్ (The Paradise). తన హిట్ దర్శకుడు, తాను పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామాపై హైప్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియెన్స్ అంతా సోషల్ మీడియాలో జడల్ జమానాలో ఉన్నారని చెప్పాలి.

మొదటిగా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ ప్రోమోకి మ్యాడ్ రెస్పాన్స్ వచ్చింది మొదలు ఫుల్ సాంగ్ వచ్చే లోపు సోషల్ మీడియా అంతా ఈ సినిమాలో నాని కనిపించే జడల లుక్ గెటప్ తో సోషల్ మీడియాలో నెటిజన్స్ మన హీరోలకి కూడా వాటిని యాడ్ చేసేసి వైరల్ చేస్తున్నారు. దీనితో జడల్ ఫీవర్ ఓ రేంజ్ లో ప్రస్తుతం కొనసాగుతుంది.

కేవలం హీరోలకేనా పాపులర్ కార్టూన్స్ కి కూడా సెట్ చేస్తున్నారు. ఒక సినిమాకి ఈ రేంజ్ లో హవా కనబడడం అనేది ఈ మధ్య కాలంలో ది ప్యారడైజ్ (The Paradise) కే చెల్లింది అనుకోవచ్చు. ఇది మాత్రం సినిమాపై ఉన్న హైప్ బార్ ని కూడా సూచిస్తుంది. ఇక ఇదే హవా కొనసాగితే మాత్రం ది ప్యారడైజ్ (The Paradise) చిత్రానికి ఊహించని ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు