‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?

‘ది రాజా సాబ్’ : ఆ వార్తల్లో నిజం లేదట ?

Published on Apr 17, 2024 1:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ హర్రర్ జానర్ మూవీ ది రాజా సాబ్. ఈ మూవీకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

కాగా ది రాజా సాబ్ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారని తాజాగా న్యూస్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే మేకర్స్ నుండి అందుతున్న మ్యాటర్ ప్రకారం ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని, అందువలన ఇంత ఎర్లీగా సాంగ్ రిలీజ్ చేసే అవకాశం పక్కాగా లేదని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు