‘ది రాజాసాబ్ ఓటీటీ’.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్..!

Raja Saab

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ‘రాజా సాబ్'(Raja Saab) చిత్రం థియేటర్ల వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో డిజిటల్ విడుదలైన తర్వాత మరోసారి భారీ ఎత్తున ట్రోలింగ్‌కు గురవుతోంది. థియేటర్లలో ఈ సినిమాను చూడని వారు సైతం ఇప్పుడు ఓటీటీలో చూసి, సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

ముఖ్యంగా సినిమాలో ప్రభాస్ కోసం ఉపయోగించిన బాడీ డబుల్, నాణ్యత లేని వీఎఫ్ఎక్స్ షాట్స్, మారుతి వీక్ రైటింగ్ పై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పాటలు మరియు ఫైట్ సీక్వెన్స్‌లలో ప్రభాస్‌కు బదులుగా మరొకరిని పెట్టి మేనేజ్ చేసిన విధానం స్పష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. “మా హీరోను మేము కూడా డిఫెండ్ చేసుకోలేకపోతున్నాము” అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version