ప్రీసేల్స్ లో ‘రాజా సాబ్’ తాండవం!

ప్రీసేల్స్ లో ‘రాజా సాబ్’ తాండవం!

Published on Dec 30, 2025 1:28 PM IST

the raja saab 6

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అలాగే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా హారర్ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”. లేటెస్ట్ కొత్త ట్రైలర్ తో పీక్ ఎక్స్ పీరియన్స్ ని ప్రామిస్ చేసిన మేకర్స్ గ్రాండ్ ప్రీమియర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా యూఎస్ మార్కెట్ లో కూడా వేస్తున్నారు.

అయితే యూఎస్ లో రాజా సాబ్ సినిమా ప్రీ సేల్స్ లో సాలిడ్ మార్క్ ని దాటింది. అక్కడ అపుడే ఈ సినిమా 2 లక్షల 50 వేల డాలర్స్ కి పైగా వసూలు చేసేసింది. అంతే కాకుండా 10 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి ఒక్క నార్త్ అమెరికా లోనే అమ్ముడుపోయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. ఇలా మొత్తానికి రాజా సాబ్ తాండవం అక్కడ కొనసాగుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ జనవరి 9న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు