‘ది రాజాసాబ్’ ఓటీటీ డీల్ పై నిర్మాత క్లారిటీ !

ది రాజా సాబ్

కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ తో ‘ది రాజాసాబ్’ అనే భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ చిత్ర నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్.. ఈ సినిమా ఓటీటీ డీల్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఓటీటీ డీల్ పూర్తయిందని ఆయన చెప్పారు, అయితే, ఊహించిన దానికంటే తక్కువ మొత్తానికే ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయ్యాయని ఆయన నిజాయితీగా చెప్పడంతో.. ఆయన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

ఇక ఓటీటీ డీల్ ఊహించిన దానికంటే తక్కువ వచ్చినా, సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయం సాధిస్తోంది అని ఆయన తెలిపారు. కాగా రొమాంటిక్‌ కామెడీ హారర్‌ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన మాళవికా మోహనన్‌, రిద్ధి కుమార్‌ కూడా సందడి చేయనున్నారు. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కాబోతుంది. అన్నట్టు ప్రభాస్ తో పాటు, ఈ సినిమాలో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

Exit mobile version