త్వరలో ప్రభాస్ “ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్!

త్వరలో ప్రభాస్ “ది రాజా సాబ్” ఫస్ట్ సింగిల్!

Published on Apr 16, 2024 10:00 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. గతేడాది సలార్ (Salaar) చిత్రం తో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో, తదుపరి కల్కి 2898AD (Kalki 2898AD) చిత్రం లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ది రాజా సాబ్ (The Raja Saab) షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. నేడు ఈ చిత్రం షూటింగ్ లో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) జాయిన్ అయ్యింది.

కొద్దిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో ఆమె పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ చిత్రం కి సంబందించిన ఫస్ట్ సింగిల్ త్వరలో రిలీజ్ కానుంది. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ చేసిన మ్యూజికల్ పోస్ట్ కి డైరెక్టర్ మారుతీ రెస్పాండ్ అవ్వడం తో మరింత క్లారిటీ వచ్చింది. త్వరలో ఫస్ట్ సింగిల్ కి సంబందించిన డేట్ ను అనౌన్స్ చేసే అవకాశం ఉంది.

హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay dutt) కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan) మరొక ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు