ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో రిలీజ్!

ఆగస్ట్ 21న ‘ది రెడ్ బ్యాగ్’: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా రెండు రాష్ట్రాల్లో రిలీజ్!

Published on Aug 16, 2026 10:23 AM IST

Red Bag

మెమరీ మేకర్స్ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. రవికుమార్ సీరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ప్రముఖ పంపిణీ సంస్థ ‘పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్’ ఈ చిత్ర హక్కులను దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, గ్లింప్స్, పాటలకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది. సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో మరిన్ని ప్రమోషనల్ అప్‌డేట్స్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు శేఖర్ మోపురి సంగీతం అందించగా, ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రాహకుడిగా, శివ శర్వాణి కూర్పు (ఎడిటింగ్) బాధ్యతలు నిర్వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు