అలవైకుంఠపురలో వాళ్ళిద్దరిదీ టామ్ అండ్ జెర్రీ స్టోరీనా…?

అలవైకుంఠపురలో వాళ్ళిద్దరిదీ టామ్ అండ్ జెర్రీ స్టోరీనా…?

Published on Nov 23, 2019 9:43 AM IST

alavaikutapuramlo

బన్నీ-త్రివిక్రమ్ కాంబినషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీని సపరేట్ గా డీల్ చేస్తున్నారు. పాటలతో ప్రచార హీట్ పెంచేస్తున్నారు. గతంలో రెండు పాటలు విడుదల చేసిన చిత్ర బృందం నిన్న మరో సాంగ్ విడుదల చేశారు. ‘ఓ మై గాడ్ డాడీ’ అనే ఈ ర్యాప్ సాంగ్ స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉంది. ఈ పాటలో బన్నీ ఆల్ట్రా మోడ్రన్ వెస్ట్రన్ లుక్ లో ఇరగదీశాడు. ఐతే ఈ పాట చూసిన తరువాత అలవైకుంఠపురంలో బన్నీ, మురళి శర్మల రేలషన్ మరియు వీరిద్దరి పాత్రల మధ్య నడిచే డ్రామా ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.

అల వైకుంఠపురంలో మురళి శర్మ వయసులో ఉన్న కొడుకు కోరికలపై, ఆశలపై ఆంక్షలు పెట్టే తండ్రిగా కనిపిస్తుండగా, మధ్యతరగతి తండ్రి ప్రవర్తనతో విసుగెత్తిపోయిన కొడుకుగా బన్నీ కనిపిస్తున్నాడు. దీనితో వీరి మధ్య టామ్ అండ్ జెర్రీ టైప్ కామెడీ ఎపిసోడ్స్ నడుస్తాయని అర్థం అవుతుంది. ఎమోషనల్ బాండింగ్ తో కూడిన చిన్న చిన్న గొడవలు అలరిస్తాయని సమాచారం.

ఇక అలవైకుంఠపురం మూవీలో బన్నీ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా, టబు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమస్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు