‘పిల్ల జమిందార్’కి సీక్వెల్ రెడీ అవుతుందా..?

‘పిల్ల జమిందార్’కి సీక్వెల్ రెడీ అవుతుందా..?

Published on Jan 3, 2015 9:10 PM IST

pilla_zamindar
హీరోగా నానికి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘పిల్ల జమిందార్‌’. శ్రీ శైలేంద్ర సినిమాస్‌ పతాకంపై అశోక్ దర్శకత్వంలో డి.ఎస్‌.రావు నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాదించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ బాగా రాబట్టి క్లాస్ ఫిల్మ్ గా పేరు పొందింది. ఈ తాత‌ మ‌న‌వ‌ళ్ల క‌ధ‌లో వినోదం, హ్యూమ‌న్ ఎమోష‌న్స్ ప్రేక్షకులను ఆక‌ట్టుకొన్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందని ఫిల్మ్ నగర్ సమాచారం.

‘పిల్ల‌ జ‌మిందార్ 2’ సినిమా తీయ‌డానికి నిర్మాత డి.ఎస్‌.రావు ఏర్పాట్లు చేస్తున్నారు. అశోక్ స్థానంలో కొత్త దర్శకుడు వచ్చి చేరారట. కథ రెడీ అయిందని, రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి, ఈ సినిమాలో హీరోగా నాని నటిస్తారా..? లేదా..? అనేది తెలియదు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు