ఫన్ & ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్

ఫన్ & ఎంటర్టైన్మెంట్ తో ఆకట్టుకుంటున్న ‘ఆ ఒక్కటీ అడక్కు’ ట్రైలర్

Published on Apr 22, 2024 5:35 PM IST

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆ ఒక్క‌టీ అడ‌క్కు. మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో ఫరియా అబ్దుల్లా క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. వెన్నెల కిశోర్‌, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ నుండి ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్‌ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్ విడుద‌ల చేయ‌గా అవి మంచి రెస్పాన్స్ ద‌క్కించుకున్నాయి.

తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని హైదరాబాద్ లోని ఈవెంట్ లో భాగంగా నాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసారు. ఇక ట్రైలర్ లో ఆద్యంతం ఆకట్టుకునే మంచి ఫన్, ఎంటర్టైన్మెంట్ అంశాలు బాగున్నాయి. ముఖ్యంగా నరేష్ యాక్టింగ్, కామెడీ డైలాగ్స్, ఫరియా అబ్దుల్లా అందం, అభినయం, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

మొత్తంగా ఆ ఒక్కటీ అడక్కు ట్రైలర్ అందరినీ ఆకట్టుంటూ మూవీ పై అంచనాలు మరింతగా పెంచింది. ఈ మూవీని వేసవి కానుక‌గా మే 3న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యాన‌ర్‌పై రాజీవ్ చిలక గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. మరి చాలా గ్యాప్ తరువాత అల్లరి నరేష్ నుండి వస్తున్న ఈ కామెడీ ఎంటర్టైనర్ ఎంతమేర ఆడియన్స్ ని అలరిస్తుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు