ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘గామి’ ట్రైలర్

ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘గామి’ ట్రైలర్

Published on Feb 29, 2024 6:26 PM IST


విశ్వక్సేన్ హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా యువ దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ గామి. ఈ మూవీని యువి సెల్యులాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా నరేష్ కుమరన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే టీజర్, పోస్టర్స్, సాంగ్స్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన గామి నుండి నేడు కొద్దిసేపటి క్రితం థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.

హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్ లో జరిగిన ట్రైలర్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ ని ప్రముఖ దర్శకడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేసారు. ఇక గామి ట్రైలర్ లో ఆద్యంతం ఆకట్టుకునే ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ అంశాలు మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. విశ్వక్సేన్ యాక్టింగ్, డైలాగ్స్, గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అన్ని కూడా ఎంతో బాగుండడంతో పాటు సినిమా చూడాలనే ఆసక్తిని మరింతగా పెంచుతాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. కాగా గామి మూవీ మార్చి 8న ఆడియన్స్ ముందుకి రానుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు