యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్

యూట్యూబ్ లో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ ట్రైలర్

Published on Feb 21, 2024 11:02 PM IST

వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎయిర్ ఫోర్స్ బేస్డ్ యాక్షన్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ తెలుగు, హిందీ బైలింగువల్ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలిసి గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ పై సందీప్ ముద్దా, నందకుమార్ అబ్బినేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు.

ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్, సాంగ్స్, పోస్టర్స్ అన్ని కూడా ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరచగా నిన్న మూవీ యొక్క థియేట్రికల్ ట్రైలర్ ని రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ రిలీజ్ చేసారు. ఇక ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అందరినీ ఆకట్టుకుంటూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. గ్రాండియర్ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, వరుణ్ తేజ్ పవర్ఫుల్ లుక్, మనిషి అందం, అభినయంతో పాటు యాక్షన్ సీన్స్ వంటివి ట్రైలర్ లో అదిరిపోయాయి. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి మార్చి 1న రిలీజ్ చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు