పొలిటికల్ యాక్షన్ అంశాలతో ఆకట్టుకుంటున్న ‘ప్రతినిధి – 2’ ట్రైలర్

టాలీవుడ్ నటుడు నారా రోహిత్ హీరోగా ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్న తాజా సినిమా ప్రతినిధి 2. ప్రతినిధి సిరీస్ నుండి వస్తున్న ఈ రెండో ఫ్రాంచైజీ సినిమా పై అందరిలో మంచి అంచనాలున్నాయి. ఈ నెల 25న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ కనిపించనుండగా ఆయనకు జోడీగా సిరీ లెల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు.

వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్స్ పై కుమార్ రాజా బత్తుల నిర్మించిన ఈ సినిమా నుండి మొదటి సింగిల్ గల్లా యెత్తి ఇటీవల విడుదల చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మాస్ నంబర్ ను మహతి స్వర సాగర్ కంపోజ్ చేసారు. విషయం ఏమిటంటే కొద్దిసేపటి క్రితం ప్రతినిధి 2 ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. తాజా రాజకీయ పరిస్థితులు, రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరుని ప్రశ్నించే అంశాలతో ఇంట్రెస్టింగ్ గా ఈ ట్రైలర్ రూపొందింది.

ఇందులో నారా రోహిత్ యాక్టింగ్, డైలాగ్స్, విజువల్స్, యాక్షన్ సీన్స్, ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా ప్రతినిధి 2 ట్రైలర్, మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచింది. ఇంకా ఈ సినిమాలో తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘు బాబు, రఘు కారుమంచి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ట్రైలర్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version