సమీక్ష : “ది ట్రయల్” – కేవలం కొన్ని థ్రిల్స్ కోసం మాత్రమే

సమీక్ష : “ది ట్రయల్” – కేవలం కొన్ని థ్రిల్స్ కోసం మాత్రమే

Published on Nov 25, 2023 3:03 AM IST
The Trial Movie Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 24, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు తదితరులు.

దర్శకుడు : రామ్ గన్ని

నిర్మాతలు: స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ

సంగీతం: శరవణ వాసుదేవన్

సినిమాటోగ్రఫీ: సాయి కుమార్ దార

ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 


టాలీవుడ్‌లో తాజాగా మొదటి ఇంటరాగేటివ్ మూవీ, ది ట్రయల్ నేడు తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది. సినిమా ఎలా ఉందో, ఆర్టిస్ట్స్ ఏ విధంగా పెర్ఫార్మ్ చేసారో తెలుసుకోవాలంటే మా పూర్తి రివ్యూ చూడండి.

 

కథ :

రూప (స్పందన పిల్లి) హైదరాబాద్ లో పని చేసే లేడీ పోలీస్. అయితే ఆమె మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆమె భర్త అజయ్ (యుగ్ రామ్) ప్రమాదవశాత్తూ భవనంపై నుండి పడి మరణించదాంతో షాక్ ని ఎదుర్కొంటుంది. కాగా కొన్నాళ్ల అనంతరం అజయ్ ని రూపే హత్యచేసిందని అతడి ఫ్యామిలీ మెంబెర్స్ ఆ కేసులో న్యాయం చేయాలనీ కేసుని రీ ఓపెన్ చేయిస్తారు. రాజీవ్ (వంశీ కోటు) ఆ కేసు కి సంబందించిన పలు వివరాలను వెలికితీస్తూ విచారణని ముందుకు సాగిస్తాడు. ఆ సమయంలో వారి దాంపత్య జీవితంలో కొన్ని ఆశ్చర్యకర విషయాలు అతడికి తెలుస్తాయి. మరి ఇంతకీ ఆ విషయాలు ఏంటి, రూప అమాయకురాలా లేక హంతకురాలా, ఈ ఊహించని మరణం వెనుక ఉన్న రహస్యాలను విప్పి, అంతిమ సత్యం వెలుగులోకి వస్తుందా లేదా అనేది మొత్తం సినిమాలో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ఇటువంటి పలు సినిమాల్లోని విచారణ సన్నివేశాలు ప్రేక్షకులకు సుపరిచితమే అయినప్పటికీ, ఈ పాయింట్ చుట్టూ కథ ప్రధానంగా తిరగడం ద్వారా ది ట్రయల్ విభిన్నంగా ఉంటుంది. మేకర్స్ ముందుగా ప్రమోట్ చేసిన విధంగా మొదటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ది ట్రయల్ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేలా ఆయా సన్నివేశాలను సునిశితంగా రూపొందించారు. స్పందన పల్లి నటనకు సంబంధించి ఈ సినిమాలో తన పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసారు. ఆమె నటన మరియు వ్యవహారశైలి ప్రేక్షకులను ఆమె పాత్ర గురించి చివరి వరకు ఊహించేలా చేస్తుంది. నటుడు వంశీ కోటు కూడా సంతృప్తికరమైన నటనను కనబరిచాడు మరియు తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ, యుగ్ రామ్ తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ మరియు సంగీతం సినిమా రిచ్‌నెస్‌కి దోహదపపడ్డాయి. సెకండాఫ్‌లో వచ్చే కొన్ని అంశాలు ఆడియన్స్ ని కట్టిపడేసేలా ఉన్నాయి.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రామ్ గన్ని ఈ మూవీకి ఒకింత మెచ్చుకోదగ్గ విధంగా కథని ఎంచుకున్నారు. అయితే అతను ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయడంలో ఫస్ట్ హాఫ్ తో సక్సెస్ అయ్యాడు. కాగా రూప మరియు రాజీవ్ మధ్య సంభాషణలు కథలో మరింత ఉత్కంఠను నింపడానికి మరింత ప్రభావవంతంగా స్క్రిప్ట్ ని వ్రాసి ఉండవచ్చు. వంశీ కోటు తగిన నటన కనబరిచినప్పటికీ, కొన్ని సన్నివేశాలలో అతను డైలాగ్‌లు చెప్పేటప్పుడు అనవసరమైన విరామం తీసుకున్నట్లు అనిపిస్తుంది, అతను తన లైన్‌లను మరచిపోయాడనే భావనను మనకి కలిగిస్తుంది. ఇంటరాగేషన్ మొదలయ్యే వరకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. ఆ తర్వాత జరిగే సంఘటనలు కాస్త విసుగు తెప్పించినా దర్శకుడు దానిని ఫస్ట్ హాఫ్‌కే పరిమితం చేసి సెకండ్ హాఫ్‌ని చక్కటి స్క్రీన్‌ప్లేతో నడిపించాడు. అయితే మరింత వ్యూహాత్మక తీరున నటీనటులు సినిమాను ఎలివేట్ చేసి ప్రేక్షకులకు మరింత కనెక్ట్ అయ్యేలా ఉండేలా చేసి ఉండవచ్చు. కొన్ని సన్నివేశాలను ఆకట్టుకునేలా తీయడంలో దర్శకుడు తడబడ్డాడు.

 

సాంకేతిక వర్గం :

ముందుగా రచయిత మరియు దర్శకుడిగా రామ్ గన్ని ఆకట్టుకునే ప్రతిభనే కనబరిచాడు. ఫస్ట్ హాఫ్‌లోని స్క్రీన్‌ప్లే ది ట్రయల్‌ని అద్భుతమైన వీక్షణ అనుభవంగా ఆడియన్స్ కి అందిస్తుంది మరియు సంభాషణలు కూడా బాగుంటాయి. సాయి కుమార్ దారా యొక్క రిచ్ సినిమాటోగ్రఫీ మరియు శరవణ వాసుదేవన్ స్కోర్ మూవీకి ప్రధాన బలాలు. ఈ రెండు ఎలిమెంట్స్ సినిమాను ఆహ్లాదకరమైన అనుభూతిగా మార్చడానికి దోహదం చేస్తాయి. ఫస్ట్ హాఫ్ లో ది ట్రయల్ యొక్క ప్లాట్ ఎంగేజ్‌మెంట్ ఫ్యాక్టర్‌ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలంటే ది ట్రయల్ కేవలం ఓకే అనిపించే క్రైమ్ థ్రిల్లర్ మాత్రమే. నటి స్పందన పిల్లి ఆకట్టుకునే నటనతో పాటు, సినిమాటోగ్రఫీ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి గణనీయమైన సాంకేతిక అంశాలు సినిమాలో బాగున్నాయి. అయితే పస లేని సన్నివేశాలు, మొదటి సగం నెమ్మదిగా సాగడం మరియు బలమైన ఎమోషనల్, కనెక్టింగ్ పాయింట్ లేకపోవడం ప్రధాన లోపాలు. ప్రధానంగా క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారిలో ఈ ట్రయల్ ఒకసారి చూడవచ్చు.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు