రంగు నాకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది – తనీష్ !

రంగు నాకు మంచి గుర్తింపును తీసుకువస్తుంది – తనీష్ !

Published on Nov 22, 2018 2:07 PM IST

త‌నీశ్‌, ప‌రుచూరి ర‌వి, ప్రియా సింగ్‌, ప‌రుచూరి వెంకటేశ్వ‌ర‌రావు, ష‌ఫీ, పోసాని కృష్ణ‌ముర‌ళి ప్ర‌ధాన పాత్రల్లో కార్తికేయ‌.వి తెరకెక్కించిన చిత్రం రంగు. న‌ల్ల‌స్వామి స‌మ‌ర్ప‌ణ‌లో యు అండ్ ఐ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపైఎ.ప‌ద్మ‌నాభ‌రెడ్డి, న‌ల్ల అయ్య‌న్న నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలవుతున్న సందర్బంగా హీరో తనీష్ మీడియాతో మాట్లాడుతూ

‘‘రంగు టైటిల్ ఎందుకు అంటే ప్రతి మనిషి లోనే చాలా రంగులుంటాయి, డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి, అవి బయటకు వచ్చే సందర్భాలుంటాయి అలాగే నేను ప్లే చేస్తున్న ‘లారా’పాత్రకు 19 యేళ్ళ వయస్సు నుండి 27 యేళ్ళ వరకూ తన జీవితం చూపించడం జరుగుతుంది. అతను తన కాలేజ్ డేస్ లో స్టేట్ ర్యాంకర్ అలాంటి వ్యక్తి తన 27 యేళ్లకు అతి దారుణంగా చంప బడ్డాడు. ఈ జర్నీ అనూహ్యంగా ఉంటుంది, అదే నన్ను ఎగ్జైట్ చేసింది. ప్రతి ఎమోషన్ ని ఒక కలర్ తో సింబలైజ్ చేస్తాం, అతని ట్రావెల్ ఎమోషన్స్ ని పీక్స్ లో ఉంటాయి. నాలుగు హోళీ పండగలు అతని జీవితాన్ని ఎలా టర్న్ చేసాయి అనేది ఈ కథ, నాలుగు వేరియేషన్స్ ఉంటాయి.. అమాయకంగా కనిపించే పాత్రనుండి ఆవేశ పడే యువకుడిగా అక్కడినుండి అతను సిస్టమ్ కి ఎదురు వెళ్ళే వ్యక్తిగా, తర్వాత తను చిక్కుకున్న వలయం నుండి బయటపడలేని ఒక అసహాయత ‘లారా’ పాత్రలో కనిపిస్తాయి. చాలా నాచురల్ గా ఉండే ఎమోషన్స్ ఇందులో కనిపిస్తాయి. ఈ సినిమాని ఏ జానర్ లోకి తీసుకెళ్ళలేము అలాంటి కథ, ఇందులో డ్రామా, ముఖ్యంగా ఆ పాత్ర చేసే ట్రావెల్ ఎదురయ్యే సమస్యలు అతన్ని ఎలా మార్చాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ‘లారా’ తన ఐడియాలిజీ పరంగా కరెక్ట్, కానీ తన ఎంచుకున్న దారిలో తప్పు చేసాడు. తను తీసుకున్న నిర్ణయాలు ఎలా తన జీవితాన్ని మలిచాయో అన్న రియలేజషన్ వచ్చాక అతన్ని చంపేస్తారు. రేపు తన పాప పుడుతుంది అనగా ఈరోజు రాత్రి అతన్ని చంపేస్తారు. ఆ సన్నివేశం లో చాలా ఎమోషనల్ అయ్యాను. చివరి అరగంట ప్రేక్షకులను భావోద్వేగాలతో నింపుతుంది. ఆ పాత్ర చేస్తున్నప్పుడు నేను కొన్ని సందర్బాలలో కనెక్ట్ అయ్యాను, నేనే కాదు చాలామంది కరెక్ట్ అవుతారు అని నమ్ముతున్నాను. రంగు సినిమాలో ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతున్నాయి అని నమ్ముతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఆర్టిస్ట్ కి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది’’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు