ఆరోజున “బాలయ్య 109” అప్డేట్ కి ఛాన్స్

ఆరోజున “బాలయ్య 109” అప్డేట్ కి ఛాన్స్

Published on May 26, 2024 5:01 PM IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఊర్వశి రౌటేలా అలాగే బాబీ డియోల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కలయికలో దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ డ్రామాపై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కిస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తుండగా ఈ సినిమా నుంచి ఓ కొత్త అప్డేట్ ని అభిమానులు గత కొన్నాళ్ల నుంచి ఆశిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య 109 నిర్మాతల సారథ్యంలోనే విశ్వక్ సేన్ నటిస్తున్న “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రం తెరకెక్కగా ఈ సినిమా ప్రీ రిలీజ్ కి బాలయ్య వెళ్లనున్నారు. సో అలా ఆ వేదికపై డెఫినెట్ గా బాలయ్య ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అప్డేట్ బాలయ్య నుంచి కానీ నాగవంశీ నుంచి కానీ వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఈ మాస్ ఫీస్ట్ కోసం ఈ మే 28 వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు