హిట్ మూవీలో విశ్వక్ సేన్ రోల్ బిగ్ ట్విస్ట్..!

Published on Feb 20, 2020 2:57 pm IST

హీరో నాని ఓ ప్రక్క వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే, తనకు నచ్చిన స్క్రిప్ట్స్ ఇతర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ స్థాపించిన నాని మొదటి చిత్రంగా కాజల్ ప్రధాన పాత్రలో ‘అ’ అనే ప్రయోగాత్మక చిత్రం తీశారు. అవార్డు విన్నింగ్ మూవీగా ఆ చిత్రానికి మంచి పేరొచ్చింది. కాగా నాని తన రెండవ ప్రయత్నంగా ‘హిట్’ అనే సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాడు. హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం డాక్టర్ శైలేష్ కొలను వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కి విశేష స్పందన లభించింది.

కాగా విశ్వక్ ఈ చిత్రంలో ఓ మిస్సింగ్ అండ్ మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారిగా కనిపిస్తుండగా ఆయన పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని తెలుస్తుంది. సీరియస్ పోలీస్ అధికారిగా ఉన్న విశ్వక్ ఓ మానసిక రుగ్మతతో బాధపడుతూ ఉంటారట. అలాగే విశ్వక్ రోల్ నందు ఓ భారీ ట్విస్ట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. క్లైమాక్స్ లో ఈ ట్విస్ట్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుందని సమాచారం. హిట్ మూవీ ఈనెల 28న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More