బన్నీ బాయ్ రికార్డ్స్ కు నో బ్రేక్స్.!

Published on Nov 27, 2020 12:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్టయ్యిందో అంతే స్థాయిలో ఆడియో పరంగా కూడా సెన్సేషన్ ను నమోదు చేసింది. ముఖ్యంగా త్రివిక్రమ్ అండ్ థమన్ ఆడియో టీం ఇచ్చిన ఎఫర్ట్స్ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం రేపాయి.

అలా ఈ అల వైకుంఠపురములో ఆల్బమ్ ఇటీవలే పలు మైల్ స్టోన్స్ టచ్ చేసింది. బుట్ట బొమ్మ సాంగ్ 450 మిలియన్ వ్యూస్ అలాగే 3 మిలియన్ లైక్స్ తో మన దక్షిణాదిలోనే ఫాస్టెస్ట్ రికార్డు సెట్ చెయ్యగా ఆ గ్యాప్ లోనే రాములో రాముల రెండు వెర్షన్ సాంగ్స్ 250 మిలియన్ వ్యూస్ లో మరో అరుదైన రికార్డును అందుకున్నాయి.

ఇక అలాగే ఇప్పుడు ఈ సినిమాలోని ఆల్ టైం మెలోడీ “సామజవరగమన” వీడియో సాంగ్ 1 మిలియన్ లైక్స్ అందుకోవడంతో బన్నీ బాయ్ రికార్డ్స్ కు బ్రేక్ లేనట్టు అయ్యిపోయింది. ఇంకో నెల పోతే ఈ సినిమా వచ్చేసి ఏడాది అయ్యిపోతుంది అయినప్పటికీ ఈ సినిమా హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం బన్నీ తన మరో హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో “పుష్ప” అనే మాస్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More