పవన్ మోస్ట్ అవైటెడ్ సినిమా గాసిప్స్ పై నిజం లేదా.?

Published on Mar 6, 2021 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు ఆసక్తికర ప్రాజెక్ట్ లలో విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి తో ప్లాన్ చేసిన భారీ బడ్జెట్ అండ్ పీరియాడిక్ చిత్రం కూడా ఒకటి. అయితే పవన్ ఎన్ని సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ సినిమానే ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను ఈ వచ్చే మహా శివరాత్రి కానుకగా విడుదల చెయ్యడానికి ఫిక్స్ చేశారు. అయితే దీనితో పాటుగానే గత కొన్ని రోజులుగా మరిన్ని గాసిప్స్ దీనిపై వినిపిస్తున్నాయి. అదే రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా టీజర్ ను కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని గాసిప్స్ మొదలయ్యాయి.

కానీ ఇందులో మాత్రం ఇంకా ఎలాంటి నిజమూ లేదన్నట్టే తెలుస్తుంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక క్లారిటీ కానీ అలాంటి అవకాశం కానీ లేనట్టే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ జస్ట్ రూమర్స్ గానే అనుకోవాలి. మరి ఈ భారీ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :