ఆయనపై వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజము లేదు.!

Published on May 21, 2020 7:01 pm IST

ఈరోజుల్లో పలు ఫేక్ కథనాలు యిట్టె వైరల్ అయ్యిపోతున్నాయి. అలాంటి ఒక వార్తే ఇప్పుడు మన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి అనారోగ్యంగా ఉందని ఆయనకు శస్త్ర చికిత్స అవసరం ఉంటుంది ఓ వార్త బయటకు వచ్చింది. కానీ అసలు విషయం ఏమిటా అన్నది ఆరా తియ్యగా అసలు ఆయనకు ఏమీ కాలేదని తెలిసింది.

కానీ ఆయనపై ఎందుకు ఈ వార్త వచ్చింది అంటే ఆయన సంబంధీకులకు అనారోగ్యం ఉంటే ఆ వార్త కాస్తా ఆయనకు ఆపాదించేసారు. దీనితో ఆయనకు అనారోగ్యం అని శస్త్ర చికిత్స అవసరం పడుతుంది అని అనేక రకాల వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు ఆ వార్తల్లో ఎలాంటి నిజమూ లేదని తేలిపోయింది. ఇలాంటి సున్నిత విషయాల్లో పూర్తి సమాచారం తెలుసుకోకుండా ప్రచారం చెయ్యడం బాధాకరం.

సంబంధిత సమాచారం :

X
More