ఫ్యూచర్ లో అల్లు అర్జున్ తో మూవీ ఉంటుంది – డైరెక్టర్ విఐ ఆనంద్

ఫ్యూచర్ లో అల్లు అర్జున్ తో మూవీ ఉంటుంది – డైరెక్టర్ విఐ ఆనంద్

Published on Feb 12, 2024 7:07 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో థ్రిల్లింగ్ ఫిక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ చేస్తూ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ అందుకుంటూ దూసుకెళ్తున్నారు దర్శకుడు విఐ ఆనంద్. ముఖ్యంగా నిఖిల్ తో ఆయన తీసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ అప్పట్లో పెద్ద విజయం అందుకుంది.

ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ తో ఊరు పేరు భైరవకోన మూవీ చేస్తున్నారు ఆనంద్. తాజాగా ఆ మూవీ యొక్క ప్రమోషన్స్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, అప్పట్లో సందీప్ కిషన్ తో టైగర్ మూవీ అనంతరం అల్లు అర్జున్ తో మూవీ చేయాల్సిందని అన్నారు. కొన్ని కథలు అనుకున్నప్పటికీ అవేవి సెట్ కాలేదని, అయితే ఫ్యూచర్ లో తప్పకుండా అల్లు అర్జున్ తో ఒక మంచి సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీ చేస్తానని అన్నారు విఐ ఆనంద్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు