‘ఖైదీ’లో హైలెట్ గా నిలిచేవి అవే !

‘ఖైదీ’లో హైలెట్ గా నిలిచేవి అవే !

Published on Oct 23, 2019 2:00 AM IST

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో కార్తీ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘ఖైదీ’. ఓ విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, మరియు తమిళ భాషలలో ఈ నెల 25న గ్రాండ్ గా విడుదల కానుంది. కాగా నాలుగు గంటల వ్యవధిలో జరిగే సంఘటనల క్రమమే ఈ సినిమా అట. ఆ నాలుగు గంటల సమయంలో ఓ ఖైదీ జీవితంలో జరిగిన అంశాలను సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రానుంది. అయితే సినిమాలో తండ్రి కూతురు మధ్య ఎమోషన్ కూడా సినిమాలోనే మంచి ఫీల్ క్రియేట్ చేస్తూ హైలెట్ గా నిలుస్తోందట.

ఇక ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకుని తెలుగులో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి మంచి హిట్ కోసం ఎదురుచూస్తోన్న కార్తికి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ ఇస్తోందో చూడాలి. సినిమా పై మాత్రం మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు