“టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..

“టిల్లు స్క్వేర్” లో కీలక హైలైట్స్..

Published on Mar 27, 2024 6:01 PM IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “టిల్లు స్క్వేర్”. మరి గతంలో వచ్చిన క్రేజీ యూత్ ఫుల్ హిట్ చిత్రం “డీజే టిల్లు” కి సీక్వెల్ గా వస్తున్నా ఈ చిత్రానికి మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం పట్ల అంచనాలతో పాటుగా అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిని ఈ సినిమా అందుకుంటుందో లేదా అనేది ఆసక్తిగా మారింది.

అయితే టిల్లు స్క్వేర్ లో కొన్ని కీలక అంశాలు మంచి హైలైట్స్ గా నిలవనున్నాయట. ఎంటర్టైన్మెంట్ ఎలాగో డబుల్ లో లెవెల్లో ఉంటుంది కానీ ఈసారి మొదటి పార్ట్ కంటే మంచి కంటెంట్ ని మేకర్స్ తీసుకొస్తున్నారట. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్ లు షాకింగ్ గా ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. ఇంకా వీటితో పాటుగా ఓ సర్ప్రైజ్ కూడా ఉండొచ్చని వినిపిస్తుంది. మొత్తానికి అయితే మరోసారి టిల్లు అండ్ గ్యాంగ్ పక్కా ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్నారని చెప్పాలి. మరి చూడాలి ఈ సినిమాకి ఏమవుతుందో అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు