‘హ‌రోం హ‌ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్టులు వీరే!

‘హ‌రోం హ‌ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్టులు వీరే!

Published on Jun 11, 2024 11:00 AM IST

నైట్రో స్టార్ సుధీర్ బాబు లీడ్ రోల్ లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘హ‌రోం హ‌ర’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. పోస్ట‌ర్స్, టీజ‌ర్ ల‌తో ఈ మూవీ మంచి బ‌జ్ క్రియేట్ చేయ‌గా, ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ ఈ మూవీపై అంచ‌నాల‌ను ఒక్క‌సారిగా పెంచేసింది. ఈసారి సుధీర్ బాబు సాలిడ్ కంటెంట్ తో వ‌స్తున్నాడ‌ని ఈ ట్రైల‌ర్ నిరూపించింది.

ఇక జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ‘హ‌రోం హర’ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నేడు ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ రెడీ అయ్యారు. జూన్ 11న సాయంత్రం 6 గంట‌ల‌కు హైద‌రాబాద్ లోని ద‌స్ప‌ల్లా క‌న్వెష‌న్ లో ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నుంది. కాగా, ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు గెస్టులుగా యంగ్ హీరోలు అడివి శేష్‌, విశ్వ‌క్ సేన్, సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హాజ‌రుకానున్న‌ట్లు మేకర్స్ వెల్ల‌డించారు.

ఈ సిమిమాను జ్ఞాన‌సాగ‌ర్ ద్వార‌క డైరెక్ట్ చేస్తుండ‌గా, సుమంత్ జి నాయుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మాళ‌విక శ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తోండ‌గా, సునీల్, రవి కాలె, కేశ‌వ్ దీప‌క్ తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు