ఆర్ ఆర్ ఆర్ హీరోలకు లాక్ డౌన్ కష్టాలు..!

ఆర్ ఆర్ ఆర్ హీరోలకు లాక్ డౌన్ కష్టాలు..!

Published on May 30, 2020 9:12 AM IST

లాక్ డౌన్ కారణంగా బిజీగా ఉండే హీరోలందరూ తమ వ్యాపకాలలో మునిగిపోతున్నారు . తమకు ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ హీరోలకు మాత్రం ఫిజిక్ అండ్ ఫిట్నెస్ కాపాడుకొనే బాధ్యత రాజమౌళి అప్పగించారట. మరి కొద్దిరోజులలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సుదీర్ఘమైన రెండు నెలల క్వారంటైన్ లో ఫిజిక్స్ లో తేడా రాకుండా వ్యాయామం తప్పని సరి చేశారట. లాక్ మొదలైన కొన్ని రోజులకే రాజమౌళి అప్పటి బరువు, ఫిజిక్ లో హెచ్చు తగ్గులు లేకుండా మైంటైన్ చేయాలని ఆదేశాలు ఇచ్చారని సమాచారం.

ఇక బాహుబలి సమయంలో కూడా ప్రభాస్ మరియు రానా చేత భారీ ధారుడ్యం కోసం కఠిన కసరత్తులు చేయించారు. ప్రభాస్ అయితే శివుడు పాత్ర కోసం బరువు తగ్గగా అమరేంద్ర బాహుబలి పాత్ర కే కోసం భారీ కాయం పెంచారు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా చరణ్ , ఎన్టీఆర్ ల ఫిజిక్ విషయంలో హెచ్చు తగ్గులు ఉండకూడని రాజమౌళి లాక్ డౌన్ లో కూడా జిమ్ లో కష్టపడాలని చెప్పడం జరిగిందని వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు