ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండడంతో ఇప్పుడు బిగ్ బాస్ 4 తెలుగు సీజన్ మరింత రసవత్తరంగా మారింది. చివరి రెండో వారంలోకి ఎంటర్ అవుతూనే బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న వారికి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సోహెల్ మరియు అరియనా ల మధ్య గొడవ కోసమే బిగ్ బాస్ వీక్షకులు మాట్లాడుకుంటున్నారు.
మొన్నటి టాస్క్ నుంచి వీరిద్దరి మధ్య మొదలైన గొడవే వారికి హాట్ టాపిక్ అయ్యింది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో సోహెల్ మరియు అరియనాల మధ్య స్టార్టైన గొడవకు మాత్రం ఇద్దరూ కారణమే అని చెప్పాలి. అలాగే ఇద్దరి దగ్గర కూడా కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సోహెల్ మరియు అరియనాల మధ్య ముందు చిన్నగానే మాట మాట మొదలైనా ఇద్దరు కూడా ఆ వాటిని ఎక్కువ చేసుకొని మాట్లాడారు.
కానీ సోహెల్ మాట్లాడింది వంద శాతం నిజమే అయ్యినప్పటికీ మళ్ళీ తన సహనాన్ని కోల్పోయాడు అది మళ్ళీ మైనస్ అయ్యింది. ఇక అరియనా అయితే తానే ముందు గొంతు రైస్ చేసి మాట్లాడ్డం ఆమె గ్రాఫ్ ను మళ్ళీ పడేలా చేసింది. ఫైనల్ గా మాత్రం ఇద్దరికీ తప్పులు ఉన్నాయి అలాగే సరైన పాయింట్స్ కూడా ఉన్నాయి.
