“బిగ్ బాస్” మాటకు వాల్యూ లేకుండా పోయిందా.?

Bigg Boss 4

మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 లో ఈ రెండు రోజులు పూర్తయ్యిపోతే ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినట్టే.. దీనితో విన్నర్ ఎవరు అన్నది కూడా క్లియర్ కానుంది.అయితే గత వారం అవినాష్ ఎలిమినేషన్ అనంతరం ఇంటి సభ్యులు చివరి రెండు వారాల్లోకి ఎంటర్ కానున్న టైం లో బిగ్ బాస్ మిగతా ఆరుగురు కంటెస్టెంట్స్ అఖిల్ ను మినహాయిస్తే ఐదుగురికి గట్టి సూచనలే ఇచ్చారు.

ఇన్నాళ్లు ఒకరికోసం ఒకరు త్యాగాలు చేసుకున్నారు కానీ ఇక నుంచి ఎవరి గేమ్ వాళ్ళే ఆడుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అది చెప్పిన నాలుగు రోజులు పర్వాలేదు అనిపించింది కానీ నిన్నటి టాస్క్ లో అయితే అసలు బిగ్ బాస్ మాటకు వాల్యూనే లేకుండా పోయినట్టు ముందులానే ఎవరికీ వారు త్యాగాలు చేసుకోడం గమనార్హం.

సోహెల్ మరియు హారికాలు ఎప్పటివో పాయింట్స్ చెప్పి మరొకరి కోసం డాన్స్ స్టేజ్ మీద నుంచి కిందకి వచ్చేయడం గమనార్హం. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ను వారు పాటించింది ఏముంది? దీనితో ఈ వారం అయినా మంచి మసాలా ఎంటెర్టైన్మెంట్ దక్కుతుంది అనుకున్న బిగ్ బాస్ ఫాలోవర్స్ కు మరోసారి నిరాశ ఎదురయ్యినట్టు అయ్యింది.

Exit mobile version